తెలంగాణలో ఫాక్స్‌కాన్ భారీ పెట్టుబడులు
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ ఫాక్స్‌కాన్ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఇవాళ ప్రగతి భవన్లో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కంపెనీ ఛైర్మన్ యంగ్ లియూ భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫాక్స్‌కాన్‌తో తెలంగాణ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. హైదరాబాద్ శివార్లలోని కొంగరకలాన్ వద్ద ఫాక్స్‌కాన్‌కు 250 ఎకరాలు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ ఎలక్ట్రానిక్ సిటీ ఏర్పాటు కానుంది. ఈ ప్లాంట్ వల్ల సుమారు లక్ష మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని భావిస్తున్నారు. ఇవాళ సాయంత్రం తెలంగాణ ప్రభుత్వం నెలకొల్పిన టీ వర్క్స్‌ను ఫాక్సాకాన్ ఛైర్మన్ ప్రారంభించనున్నారు. యాపిల్‌తో సహా పలు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలకు ప్రొడక్ట్‌లను ఫాక్స్‌కాన్ తయరు చేస్తోంది.