జీఎస్టీ వసూళ్ళు రూ. 1.49 లక్షల కోట్లు
గత జనవరితో పోలిస్తే ఫిబ్రవరి నెలలో జీఎస్టీ వసూళ్ళు స్వల్పంగా క్షీణించాయి. గత జనవరిలో జీఎస్టీ వసూళ్ళు రూ.1.57లక్షల కోట్లు కాగా, ఫిబ్రవరి నెలలో రూ.1.49లక్షల కోట్లు వసూలయ్యాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే మా్తరం జీఎస్టీ వసూళ్ళు 12 శాతం పెరిగాయి. గత ఏడాది ఫిబ్రవరిలో జీఎస్టీ వసూళ్ళు రూ.1.33 లక్షల కోట్లు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ.1,49,577 కోట్లు కాగా అందులో సీజీఎస్టీ (CGST) కింద రూ.27,662 కోట్లు, ఎస్జీఎస్టీ (SGST) కింద రూ.34,915 కోట్లు, ఐజీఎస్టీ (IGST) కింద రూ.75,069 కోట్లు వసూలు అయినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. సెస్సుల రూపంలో రూ.11,931 కోట్లు వసూలైనట్లు పేర్కొంది. ఇప్పటి వరకు జీఎస్టీ వసూళ్ళలో
2022 ఏప్రిల్ నెలదే రికార్డు. ఆ నెలలో రూ.1.68లక్షల కోట్ల జీఎస్టీ వసూలు అయింది.