గ్రీన్‌లో ప్రారంభమైన మార్కెట్
మార్కెట్ ఇవాళ గ్రీన్‌లో ప్రారంభమయ్యాయి. చాలా రోజుల తరవాత అదానీ గ్రూప్‌లోని పలు కంపెనీల షేర్లు లాభాల్లోకి వచ్చాయి. నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లో 17400ని దాటినా ఇపుడు 17375 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. అన్ని ప్రధాన సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. అర శాతంపైగా లాభంతో ఉన్నాయి. నిఫ్టిలో 35 షేర్లు లాభాల్లో ఉన్నాయి. నిఫ్టిలో టాప్ గెయినర్‌గా నిలిచిన అదానీ ఎంటర్‌ప్రైజస్ ఇవాళ కూడా ఆరు శాతంపైగా లాభంతో టాప్ గెయినర్‌గా ఉంది. అదానీ పోర్ట్స్ కూడా రెండు శాతం లాభపడింది. మెటల్ షేర్లు వెలుగులో ఉన్నాయి. నిఫ్టి నెక్ట్స్‌లో అదానీ గ్రీన్, అదానీ ట్రాన్స్‌మిషన్ అయిదు శాతం లాభంతో అప్పర్ సీలింగ్‌తో ఉన్నాయి. మరోవైపు అదానీ టోటల్ కూడా మూడు శాతం లాభంతో ఉంది.