32 సంస్థలకు పేమెంట్ అగ్రిగేటర్స్ లైసెన్స్
పైన్ ల్యాబ్స్, రేజర్‌పే, రిలయన్స్, గూగుల్, జొమాటొ, వరల్డ్ లైన్ వంటి 32 సంస్థలకు సూత్రప్రాయంగా పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్‌ను ఆర్బీఐ జారీ చేసింది. 32 సంస్థల జాబితాను విడుదల చేసింది. ఇందులో ఇంకా ఫోన్ పే, క్రెడ్, బమొబిక్విక్, ఇన్స్టామోజొ కూడా ఉన్నాయి. అయితే ఫ్రీఛార్జ్, పేటీఎం, పేయూ, తప్తిస్ టెక్నాలజీస్ల దరఖాస్తులను తిరస్కరించింది. ఈ లైసెన్స్ కోసం 185 సంస్థలు దరఖాస్తు చేశాయి. 2020 నుంచి పేమెంట్ అగ్రిగేటర్స్ రంగాన్ని నియంత్రించి.. వాటికి ఆర్బీఐ లైసెన్స్‌లను జారీ చేస్తోంది.