For Money

Business News

స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన

కడప జిల్లాల్లో స్టీల్‌ ప్లాంట్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి భూమిపూజ చేశారు. స్టీల్‌ ప్లాంట్‌ భూమి పూజ చేయడం ఇది రెండోసారి. కడపజల్లా జమ్మలమడుగు మండలం, సున్నపురాళ్లపల్లె దగ్గర జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ కంపెనీ ఈ స్టీల్‌ప్లాంట్‌ను నెలకొల్పనుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం మూడు దశల్లో పూర్తి చేస్తారని అన్నారు. తొలి దశ 36 నెలల్లో పూర్తవుతుందని, ఈ దశలో రూ.3,300 కోట్లను ఖర్చు పెడతారని అన్నారు. 3500 ఎకరాల భూమి .. రూ. 700 కోట్లతో మౌలిక సదుపాయాలను తమ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోందని సీఎం జగన్‌ ఈ సందర్భంగా వెల్లడించారు.ఈ ప్లాంట్ కోసం చాలా కష్ట పడ్డామని.. మంచి రోజులు వచ్చాయన్నారు. స్టీల్ సిటీ కావాలనే అభివృద్ధి పనులు చేస్తున్నామని జగన్‌ స్పష్టం చేశారు.