For Money

Business News

నష్టాలతో ప్రారంభం

సింగపూర్ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి ఇవాళ ప్రారంభమైంది. ఓపెనింగ్‌లో 17853ని తాకిన నిఫ్టి… ఇపుడు 65 పాయింట్ల నష్టంతో 17864 వద్ద ట్రేడవుతోంది. ప్రపంచ మార్కెట్లు నష్టాల్లో ఉండటంతో మన మార్కెట్లలో కూడా సెంటిమెంట్‌ బలహీనంగా ఉంది. ఇవాళ బ్యాంకు షేర్లలో కాస్త ఒత్తిడి కన్పిస్తోంది. ఈ సూచి 0.4 శాతం క్షీణించింది. అదానీ షేర్లు మిశ్రమంగా ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజస్‌ లాభాల్లో ఉండగా, ఏసీసీ, గుజరాత్‌ అంబుజా కూడా గ్రీన్‌లో ఉన్నాయి. అయితే అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ టోటల్‌, అదానీ గ్రీన్‌ షేర్లు అయిదు శాతం లోయర్‌ సీలింగ్‌లో ట్రేడవుతున్నాయి. ఇవాళ కూడా రిలయన్స్‌ గ్రీన్‌లో ఉంది. నిఫ్టి నెక్ట్స్‌లో పీఐ ఇండస్ట్రీస్‌ 5.8 శాతం లాభంతో ట్రేడవుతోంది. మిడ్ క్యాప్‌లో భారత్‌ ఫోర్జ్‌ 6 శాతం నష్టంతో ట్రేడవుతోంది.