దిగువ స్థాయిలో అందిన మద్దతు
ఇవాళ స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు క్రమంగా బలపడుతూ వచ్చాయి. ఉదయం ఒకదశలో 17800 స్థాయిని తాకిన నిఫ్టి క్లోజింగ్ ముందు 17954 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే 159 పాయింట్ల లాభంతో 17929 పాయింట్ల వద్ద ముగిసింది. ఉదయం భారీగా నష్టపోయిన అదానీ గ్రూప్‌లోని ప్రధాన షేర్లు చివర్లో గ్రీన్‌లో ముగిశాయి. నిఫ్టి, బ్యాంక్ నిఫ్టిలు గ్రీన్‌లో క్లోజ్ కాగా, నిఫ్టి నెక్ట్స్, మిడ్‌క్యాప్ నిఫ్టిలు నష్టాల్లో ముగిశాయి. ము ఖ్యంగా నిఫ్టి నెక్ట్స్‌ను అదానీ షేర్లు దెబ్బతీశాయి. అదానీ ఎంటర్‌ప్రైజస్, అదానీ పోర్ట్స్ 2 శాతం దాకా లాభంతో ముగిశాయి. యూపీఎల్, ఐటీసీ, రిలయన్స్ షేర్లు నిఫ్టి టాప్ గెయినర్స్‌లో ముందున్నాయి. అదానీ గ్రీన్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ టోటల్ షేర్లు ఇవాళ కూడా అయిదు శాతం లోయర్ సీలింగ్ వద్ద ముగిశాయి. అంబుజా సిమెంట్ రెండు శాతం నష్టపోగా, ఏసీసీ స్వల్ప లాభాలతో ముగిసింది. అదానీ కౌంటర్లలో డెలివరీ శాతం చాలా తక్కువగా ఉండటం విశేషం.