For Money

Business News

250 కొత్త విమానాలకు ఆర్డర్‌

టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిర్‌ ఇండియా దాదాపు 16 ఏళ్ళ తరవాత కొత్త విమానాలకు ఆర్డర్‌ చేసింది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సమయంలో ఎయిర్‌ ఇండియా 2005లో 111 విమానాలు కొనుగోలు చేసింది. ఆ తరవాత ప్రభుత్వాన్ని ఈ కంపెనీని అమ్మేయడంతో టాటాలు కొన్నారు. టాటాల చేతికి వచ్చాక తొలిసారి 250 విమానాలకు ఆర్డర్‌ ఇచ్చినట్లు టాటా సన్స్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ అన్నారు. ప్రముఖ విమాన తయారీ సంస్థ ఎయిర్‌బస్‌ నుంచి ఈ విమానాలను ఎయిర్‌ ఇండియా కొనుగోలు చేయనుంది. ఈ 250 విమానాల్లో 40 వైడ్‌ బాడీ కలిగిన ఏ350 విమానాలను, మిగిలిన 210 నారో బాడీ విమానాలను కొనుగోలు చేస్తున్నట్లు చంద్రశేఖరన్‌ చెప్పారు. వైడ్‌ బాడీ విమానాలను 16 గంటలకు పైగా ప్రయాణాలకు వినియోగించనున్నట్లు చెప్పారు. మరో 220 విమానాలను బోయింగ్‌ నుంచి ఎయిర్‌ ఇండియా కొనుగోలు చేసే అవకాశం ఉంది.