నికర లాభం దాదాపు డబుల్
డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో ఎయిర్ టెల్ రూ. 1,588.2 కోట్ల లాభాలను ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో ఆర్జించిన రూ. 829.6 కోట్లతో పోలిస్తే ఈ సారి నికర లాభం 91 శాతం పెరిగింది. మొబైల్ యూజర్ పై సగటు ఆదాయం (ARPU) రూ. 163 నుంచి 193 పెరిగింది. కంపెనీ ఆదాయం కూడా రూ. 29,866 కోట్ల నుంచి రూ. 35,804 కోట్లకు చేరింది. అంటే ఆదాయం 20% పెరిగిందన్నమాట. అయితే కంపెనీ నికర లాభం మాత్రం మార్కెట్ అంచనాలకు అనుగుణంగా లేదు. పోస్ట్‌పెయిడ్, ఎంటర్ప్రైజ్, హోమ్స్ విభాగంతో పాటు ఆఫ్రికా వ్యాపారంలోనూ వృద్ధి కొనసాగినట్లు కంపెనీ పేర్కొంది. ఒక్క డీటీహెచ్ వ్యాపారంలో మాత్రమే వృద్ధి నెమ్మదించినట్లు కంపెనీ వెల్లడించింది.