ఈసారి ఎన్నికల బడ్జెట్
ప్రస్తుత నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇవాళ చివరి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నందున… కేవలం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉంటుంది. దీంతో ఇవాళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టే బడ్జెట్‌ను అన్ని రాజకీయ పక్షాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అధిక ధరలతో అల్లాడుతున్న జనం కూడా ఈసారి బడ్జెట్‌పై ఆశతో ఉన్నారు. ముఖ్యంగా గత రెండు బడ్జెట్లలో ఊరించే ప్రకటనలేవీ లేకపోవడంతో ఈసారి బడ్జెట్లో పన్ను మినహాయింపుల కోసం పన్ను చెల్లింపుదారులు చాలా ఆతృతుతో ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఆర్థిక సర్వే పెరుగుతున్న కరెంట్ అకౌంట్ లోటు గురించి గట్టిగా హెచ్చరించింది. అలాగే దేశీయంగా డిమాండ్ పెరిగితేనే వృద్ధి రేటు పెరిగే ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది. నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన కొత్త పన్ను విధానాన్ని పన్ను చెల్లింపుదారులు ఆసక్తి చూపలేదు. పాత పద్ధతికే మొగ్గు చూపుతున్నారు. దీంతో కొత్త పద్ధతికి మెరుగులు దిద్దుతారని అంటున్నారు. అలాగే దేశీయంగా డిమాండ్ పెంచేందుకు ఆర్థికమంత్రి ఏం చేస్తారో కూడా చూడాలి.