నిఫ్టిపై అదానీ ఒత్తిడి
ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ఉన్నందున అదానీ ఎంటర్‌ప్రైజస్ షేర్‌ను గ్రీన్‌లో ఉంచేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అదానీ పోర్ట్స్ కూడా. ఒకదశలో అప్పర్ సీలింగ్‌ని తాకిన ఈ రెండు షేర్లూ ఇపుడు ఒక మోస్తరు లాభాలతో ట్రేడవుతున్నాయి. అయితే అదానీ గ్రూప్‌నకు చెందిన ఇతర షేర్లలో మాత్రం ఒత్తిడి కొనసాగుతోంది. దీంతో నిఫ్టి 11 పాయింట్ల లాభంతో ఉండగా… నిఫ్టి నెక్ట్స్ ఏకంగా ఒక శాతంపైగా నష్టంతో ఉంది. ఒకదశలో నిఫ్టి 17446 పాయింట్లను తాకగా… ఇపుడు 17,616 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. అలాగే నిఫ్టి నెక్ట్స్ 38655ని తాకిన తరవాత ఇపుడు 38855 వద్ద ట్రేడవుతోంది. అదానీ టోటల్ ఇవాళ కూడా 20 శాతం నష్టపోయింది. అలాగే అదానీ గ్రీన్, అదానీ ట్రాన్స్మిషన్ షేర్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మరోవైపు అదానీ గ్రూప్‌నకు చెందిన సిమెంట్ షేర్లు… అంబుజా సిమెంట్ అయిదు శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఇక ఏసీసీ రెండున్నర శాతం లాభంతో ట్రేడవుతోంది.