టాప్‌గేర్‌లో మారుతీ పనితీరు
డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో మారుతి సుజుకీ అద్భుత పనితీరు కనబర్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.2,351.3 కోట్ల నికర లాభాన్ని గడించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.1,011.3 కోట్లు. పండుగ సీజన్ కావడంతో వాహన అమ్మకాలు జోరుగా ఉన్నాయి. ఇక కంపెనీ అమ్మకాలు రూ.22,187.6 కోట్ల నుంచి రూ.27,849.2 కోట్లకు చేరాయి. గత త్రైమాసికంలో సంస్థ 4,65,911 యూనిట్ల వాహనాలను అమ్మినట్లు తెలిపింది. వీటిలో దేశీయంగా 4,03,929 వాహనాలను అమ్మగా, 61,982 వాహనాలను ఎగుమతి చేసింది. నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు ముడి పదార్థాల ధరలు తగ్గడంతో నిర్వహణ లాభాలు పెరిగాయి. చిప్‌ల కొరతతో గత త్రైమాసికంలో సంస్థ 46 వేల వాహనాలను ఉత్పత్తి చేయలేకపోయినట్లు కంపెనీ తెలిపింది.