For Money

Business News

నష్టాలతో ప్రారంభం కానున్న నిఫ్టి

రాత్రి అమెరికా మార్కెట్లు నిస్తేజంగా ముగిశాయి. వరుస లాభాలతో తరవాత రాత్రి వాల్‌స్ట్రీట్‌ 0.27 శాతం నష్టంతో ముగిసింది. ఇక ఎస్‌ అండ్‌ పీ 500 సూచీలో మార్పు లేదు. డౌజోన్స్‌ మాత్రం 0.31 శాతం లాభంతో ముగిసింది. డాలర్‌ ఇండెక్స్‌ 102 దిగువన క్లోజైంది. దీంతొ క్రూడ్‌ ఆయిల్‌, బులియన్‌ భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్‌ 87 డాలర్లకు చేరగా, ఔన్స్‌ బంగారం ధర 1938 డాలర్లను దాటింది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు స్తబ్దుగా ఉన్నాయి. చైనా, హాంగ్‌కాంగ్‌ మార్కెట్లకు సెలవు. కోస్పి 1.34 శాతం లాభంతో ఉండగా, జపాన్‌ నిక్కీలో మార్పు లేదు. ఇక సింగపూర్ నిఫ్టి 44 పాయింట్ల నష్టంతో ఉంది. సో… నిఫ్టి ఇవాళ స్వల్ప నష్టంతో లేదా స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశముంది.