దిగువస్థాయిలో నిఫ్టికి మద్దతు
కొన్ని నిమిషాల్లోనే నిఫ్టి 50 పాయింట్లు క్షీణించి, రికవరైంది. ఉదయం నిఫ్టి ట్రేడ్‌లో అంచనా వేసినట్లు నిఫ్టిని 15870-15900 మధ్య అమ్మి స్వల్ప లాభం ఆర్జించే వ్యూహం ఫలించింది. నిఫ్టి15,877ని తాకిన నిఫ్టి కొన్ని నిమిషాల్లోనే 15,834ని తాకింది. ఇపుడు మళ్ళీ కోలుకుని 15,870 వద్ద 107 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టి 42 షేర్లు లాభాల్లో ఉన్నాయి. నిఫ్టి మిడ్ క్యాప్ కూడా 0.6 శాతం లాభంతో ట్రేడవుతోంది. బ్యాంక్ నిఫ్టి కూడా ఇదే స్థాయి లాభాలతో ట్రేడవుతోంది. మిడ్ సెషన్‌లోగా నిఫ్టిలో మళ్ళీ ఒత్తిడి వస్తుందేమో చూడాలి. డే ట్రేడర్స్ అమెరికా ఫ్యూచర్స్‌ను గమనించి … ట్రేడ్ చేయడం మంచిది.
నిఫ్టి టాప్ గెయినర్స్
బ్రిటానియా 3,523.55 2.93
ఎస్బీఐ లైఫ్ 1,125.40 2.44
గ్రాసిం ఇండస్ట్రీస్ 1,585.45 2.20
టాటా కన్జూమర్ 770.20 1.84
యాక్సిస్ బ్యాంక్ 721.50 1.78
నిఫ్టి టాప్ లూజర్స్
యూపీఎల్ 796.90 -1.44
టెక్ మహీంద్రా 1,203.60 -0.49
విప్రో 584.50 -0.45
టాటా స్టీల్ 1,429.15 -0.36
ఎన్టీపీసీ 117.95 -0.21