18100 ప్రాంతంలోనే నిఫ్టి
సింగపూర్ నిఫ్టికి భిన్నంగా స్వల్ప నష్టాలతో నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లో 18106ని తాకిన నిఫ్టి ఇపుడు 18095 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 37 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. సెన్సెక్స్ 120 పాయింట్ల నష్టంతో ఉంది. నిఫ్టికి అధిక స్థాయిలో ఒత్తిడి కన్పిస్తోంది. మరి నిఫ్టి ఈ స్థాయిలో నిలదొక్కుకుంటుందా లేదా 18000 పాయింట్లకు సమీపంలోకి వస్తుందా అన్నది చూడాలి. నిన్న బాగా పెరిగిన మెటల్, సుగర్ షేర్లలో లాభాల స్వీకరణ కన్పిస్తోంది. ఇక ఐటీ షేర్లు షరా మామూలు. ఇంకా పడుతూనే ఉన్నాయి. ఇతర ప్రధాన సూచీలు మిడ్ క్యాప్ నిఫ్టిలో కాస్త ఒత్తిడి కన్పిస్తోంది. బ్యాంక్ నిఫ్టి దాదాపు క్రితం స్థాయిలోనే ఉంది. సూచీలు పెద్దగా నష్టాల్లో లేకున్నా… షేర్లలో మాత్రం లాభాల స్వీకరణ కన్పిస్తోంది. నిఫ్టిబ్యాంక్లో కూడా కేవలం మూడు షేర్లు లాభాల్లో ఉన్నాయి. చాలా వరకు మిడ్ క్యాప్ పీఎస్‌యూ బ్యాంకులు డల్‌గా లేదా స్వల్ప నష్టాల్లో ఉన్నాయి.