సహారా గ్రూప్ ఆస్తుల జప్తు
సహారా గ్రూప్ సంస్థ, అధిపతి సుబ్రతా రాయ్‌లకు చెందిన బ్యాంకు, డీమ్యాట్ ఖాతాల జప్తు చేయాల్సిందిగా స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆదేశాలు జారీ చేసింది. ఆప్షనల్లీ ఫుల్లీ కన్వర్టబుల్ డిబెంచర్స్ (ఓఎఫ్సీడీలు) జారీలో నిబంధనల ఉల్లంఘించినందుకు రూ.6.42 కోట్లను సెబీ జరిమానాగా వేసింది. ఈ మొత్తం రికవరీ చేయడం కోసం ఆస్తుల జప్తునకు ఆదేశాలు జారీ చేసింది. సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ (ప్రస్తుత సహారా కమొడిటీ సర్వీసెస్ కార్పొరేషన్), సుబ్రతా రాయ్ అశోక్ రాయ్ చౌధరి, రవి శంకర్ దూబే, వందన భార్గవల నుంచి రికవరీ జరగనుంది. వడ్డీ, అన్ని ఖర్చులు, ఛార్జీలు, ఇతర వ్యయాలన్నీ కలిపి రూ.6.42 కోట్లు చెల్లించాలని సెబీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.