ఆ మూర్ఖుడు దొరగ్గానే… రాజీనామా చేస్తా
ట్విటర్ సీఈఓగా పనిచేసేందుకు ఆసక్తి చూపే మూర్ఖుడుని తనకు దొరికితే… వెంటనే తాను రాజీనామా చేస్తానని ట్విటర్ సీఈఓ ఎలాన్ మస్క్ అన్నారు. సాఫ్ట్వేర్, సర్వీస్ టీమ్స్‌తో పనిచేయడం తనకు సరదాగా ఉందని ఆయన ట్వీట్ చేశారు. తాను సీఈఓగా ఉండాలా వొద్దా అంటూ మస్క్ ఇటీవల ట్విటర్‌పై పోల్ పెట్టిన విషయం తెలిసిందే. 57.5 శాతం మంది సీఈఓగా ఎలాన్ మస్క్ అక్కర్లేదని పోల్ చేశారు. ఓటింగ్ నిర్ణయాన్ని తాను ఫాలో అవుతానని చెప్పడంతో… ఇపుడు ఆయన రాజీనామా చేయాల్సి పరిస్థితి ఏర్పడింది.