18300 ఔట్… నెక్ట్ లెవల్ ఏది?
మార్కెట్లో ఓపెనింగ్‌లో వచ్చిన భారీ లాభాల స్వీకరణతో నిఫ్టి 18300 స్థాయిని కోల్పోయింది. పీఎస్‌యూ బ్యాంకుల్లో లాభాల స్వీకరణ కన్పిస్తోంది. మెటల్స్ కూడా. ఐటీ షేర్లలో కొత్త 52 వారాలకనిష్ఠ స్థాయిలు ఏర్పడుతున్నాయి. నిఫ్టికి కీలక స్థాయి 18317, రెండో మద్దతు స్థాయి 18231 స్థాయి. ఈ స్థాయిని కూడా కోల్పోతే…18217. ఈ స్థాయిని కోల్పోతే మార్కెట్ స్వల్ప కాలనీ బేర్ మార్కెట్లోకి జారుకోవచ్చు. నిఫ్టి ఇప్పటి వరకు 18213 స్థాయిని తాకింది. నిన్నటి క్రితం ముగింపును దిగువకు నిఫ్టి తాకింది. అక్కడి నుంచి కోలుకుని ఇపుడు 18240 వద్ద ట్రేడవుతోంది.