నష్టాల్లో SGX NIFTY
రాత్రి అమెరికా మార్కెట్లలో నష్టాలు కొనసాగాయి. ముఖ్యంగా నాస్డాక్ భారీగా క్షీణించింది. డౌజోన్స్ కేవలం 0.49 శాతం నష్టపోగా… నాస్డాక్ ఏకంగా 1.49 శాతం నష్టపోయింది. ఎస్ అండ్ పీ 500 సూచీ కూడా 0.9 శాతం నష్టంతో ముగిసింది. డాలర్ రాత్రి బలహీనపడింది. డాలర్ ఇండెక్స్ 104కు చేరింది. బ్రెంట్ క్రూడ్ 80 డాలర్లపైనే ఉంటోంది. నిన్న యూరో మార్కెట్లు గ్రీన్లో ముగిసినా… కొన్ని మార్కెట్లు మాత్రమే ఒక మోస్తరు లాభాలతో ముగిశాయి. చాలా వరకు నామమాత్రపు లాభాలతో ముగిశాయి. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లన్నీ నష్టాల్లో ఉన్నాయి.. జపాన్ తప్ప. జపాన్ నిక్కీ 0.33 శాతం లాభంలో ఉండగా.. అన్ని ఆసియా మార్కెట్లు అర శాతంపైగా నష్టంతో ఉన్నాయి. చైనాలో కరోనా విజృంభిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిఫ్టి 35 పాయింట్ల నష్టంతో ఉంది. సో.. నిఫ్టి ఇవాళ స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశముంది.