నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా
”కరెక్ట్. ఈ విషయంలో నేను ఇది వరకు చెప్పిన మాటలను వెనక్కి తీసుకుంటున్నా. ఈ కంపెనీ వ్యవస్థాపకుల పిల్లలకు కూడా చట్టబద్ధంగా వారికి ఇవ్వాల్సిన పొజిషన్ ఇవ్వాల్సింది. ఫలానా ఉద్యోగానికి వారు సరిగ్గా సరిపోతారని అనిపించినపుడు… ఇతర ఉద్యోగులకు అవకాశం ఇచ్చినట్లే కంపెనీ వ్యవస్థాపకుల పిల్లకు కూడా అవకాశం ఇవ్వాల్సింద”ని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అన్నారు. కంపెనీ నుంచి తమ పిల్లలను దూరంగా ఉంచడం పొరపాటేనని ఆయన అంగీకరించారు. కంపెనీ 40వ వార్షికోత్సవ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పారు 2013లో నారాయణమూర్తికి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా ఆయన కుమారుడు రోహన్ మూర్తి పనిచేశారు. ఆ తరవాత 2014లో ఇద్దరూ ఇన్ఫోసిస్‌కు గుడ్ బై చెప్పారు. నిన్నటి కార్యక్రమంలో గాయని శ్రేయా ఘోషల్ పాటకు సుధా నారాయణ మూర్తి డ్యాన్స్ చేయడం విశేషం.