నష్టాల్లో మొదలైనా…
సింగపూర్ నిఫ్టి స్థాయిలో నిఫ్టి దాదాపు 60 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. అయితే కేవలం కొన్ని క్షణాల్లో దాదాపు మొత్తం నష్టాలను కవర్ చేసుకుంటూ 18652ని తాకింది. ఇపుడు 18,644 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 16 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టి 18600-18700 మధ్య ఇవాళ కదలాడే అవకాశాలే అధికంగా కన్పిస్తున్నాయి. నిఫ్టి బ్యాంక్ నష్టాల్లో ఓపెనైనా.. కేవలం క్షణాల్లో గ్రీన్‌లోకి వచ్చేసింది. ఇతర సూచీలన్నీ గ్రీన్లోఉన్నాయి. ఉదయం పలు బ్రోకింగ్ సంస్థలు లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలను సిఫారసు చేశాయి. ఎన్టీపీసీ ఇవాళ టాప్ గెయినర్‌గా నిలిచింది నిఫ్టిలో. ఐఆర్సీటీసీలో ఇవాళ బ్లాక్ డీల్ ఓపెనింగ్‌కు ముందే పూర్తయింది. అయినా ఈ షేర్ 5 శాతం నష్టంతో రూ.598 వద్ద ట్రేడవుతోంది. దాదాపు ఇతర షేర్లలో పెద్ద మార్పు లేదు. నామమాత్రపు హెచ్చుతగ్గులు మాత్రమే ఉన్నాయి. మిడ్‌క్యాప్ బాగున్నాయి. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఇవాళ కూడా ఒక శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. లారస్ ల్యాబ్ రూ.400 దాటేందుకు ప్రయత్నిస్తోంది. ఎస్బీఐ ఆల్‌టైమ్ హై వద్ద ట్రేడవుతోంది. నిన్న స్వల్ప నష్టాలతో ముగిసిన అన్ని మిడ్ క్యాప్ బ్యాంకులు ఇవాళ గ్రీన్‌లో ఉన్నాయి. పీఎన్బీ ఒకటిన్నర శాతం లాభంతో ఉంది. ఒక రేంజ్లో నిఫ్టి కదలాడే ఉంది.