నష్టాల్లో SGX NIFTY
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు తరవాత కూడా మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జొరేమ్ పావెల్ ప్రసంగం పెద్దగా పాజిటివ్‌గా లేకపోవడంతో మార్కెట్లు పెద్దగా స్పందించలేదు. వాస్తవానికి ఈక్విటీ మార్కెట్లు స్వల్ప నష్టాలతో క్లోజ్ కావడం పాజిటివ్ అంశమని అంటున్నారు. అయితే మార్కెట్‌కు పెద్దగా ట్రిగ్గర్స్ లేవు. రాత్రి పెరిగినా డాలర్ ఇండెక్స్ 105 దిగువనే ఉంది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లన్నీ నష్టాల్లో ఉన్నాయి. అయితే నష్టాలు ఒక మోస్తరుగా ఉన్నాయి. జపాన్ నిక్కీ 0.36శాతం నష్టంతో ట్రేడవుతుండగా.. హాంగ్‌సెంగ్ 1.64 శాతం నష్టంతో ఉంది. చైనా మార్కెట్లు నష్టాలు అర శాతంలోపే ఉన్నాయి. ఇక సింగపూర్ నిఫ్టి 70 పాయింట్ల నష్టంతో ఉంది. నిఫ్టి కూడా ఈ స్థాయి నష్టంతో ప్రారంభమౌతుందా అన్నది చూడాలి. లేదా తక్కువ నష్టంతో ప్రారంభం కావొచ్చు.