For Money

Business News

త్వరలో టాటా టెక్‌ ఐపీఓ

టాటా టెక్నాలజీస్‌ను లిస్ట్ చేయాలని టాటా మోటార్స్‌ నిర్ణయించింది. ప్రస్తుతం ఈ కంపెనీ టాటా మోటార్స్‌కు అనుబంధ కంపెనీగా ఉంది. నిన్న జరిగిన టాటా మోటార్స్‌ బోర్డు సమావేశంలో టాటా టెక్‌ ఐపీఓకు సంబంధించిన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ కంపెనీలో ఉన్న కొంత వాటాను పబ్లిక్‌కు ఆఫర్‌ చేయనున్నారు. ఒక బిలియన్‌ డాలర్‌ కంపెనీగా పేర్కొంటున్న టాటా టెక్నాలజీస్‌ షేర్‌ పబ్లిక్‌ ఆఫర్‌కు సంబంధించిన ప్రక్రియ త్వరలోనే ప్రారంభం అవుతుందని కంపెనీ పేర్కొంది.త్వరలోనే సెబీ వద్ద ప్రాస్పెక్టస్‌ దాఖలు చేస్తామని టాటా మోటార్స్‌ పేర్కొంది. టీసీఎస్‌ లిస్టింగ్‌ తరవాత టాటా గ్రూప్‌ నుంచి రెండు ఐపీఓలు వస్తున్నాయి. ఒకటి టాటా ప్లే (టాటా స్కయ్‌) కాగా, రెండోది టాటా టెక్నాలజీస్‌.