For Money

Business News

స్వల్ప లాభాలతో ….

సింగపూర్‌ నిఫ్టి సూచించిన స్థాయిలోనే నిఫ్టి స్వల్ప లాభాలతో ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 18540ని తాకిన నిఫ్టి … ఇపుడు 18531 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 24 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. దాదాపు అన్ని సూచీలు నామ మాత్రపు లాభాల్లో ట్రేడవుతున్నాయి. 18600 కాల్ రైటింగ్‌ జోరుగా ఉన్నందున.. చాలా మంది ఇన్వెస్టర్లు లాంగ్‌ పొజిషన్‌ తీసుకునేందుకు జంకుతున్నారు. పైగా ఇవాళ, రేపు అమెరికా నుంచి కీలక డేటా రానుంది. పైగా క్రిస్మస్‌ సెలవుల హడావుడి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. దీంతో ట్రేడింగ్‌ పరిమాణం బాగా తగ్గింది. షేర్ల బైబ్యాక్‌పై నిర్ణయం తీసుకునేందుకు పేటీఎం బోర్డు ఇవాళ భేటీ కానుంది. ఈ షేర్‌ గ్రీన్‌లో ఉంది. అలాగే టాటా టెక్‌ని లిస్ట్‌ చేయాలని నిర్ణయించడంతో టాటా మోటార్స్‌ గ్రీన్‌లో ఉంది. నిఫ్టి టాప్‌ గెయినర్‌గా ఉంది. ఇటీవల పెరుగుతూ వచ్చిన అపోలో హాస్పిటల్‌లో స్వల్ప లాభాల స్వీకరణ కన్పిస్తోంది. దివీస్‌ ల్యాబ్‌ గ్రీన్‌లో ఉంది. నిన్న బాగా తగ్గిన రెయిన్‌బో హస్పిటల్‌ షేర్‌ ఇవాళ రూ.12 పెరిగింది. దాదాపు నిన్నటి నష్టాలను కవర్‌ చేసుకుంది. లారస్‌ ల్యాబ్ రూ. 400 స్థాయిని ఇవాళ బ్రేక్‌ చేసి దిగువకు వెళ్ళింది. అరబిందో ఫార్మా గ్రీన్‌లో ఉన్నా… నామమాత్రమే.