విమ్ బ్లాక్… ఫర్ మెన్
హిందుస్థాన్ లీవర్ ఉత్పత్తి చేసే విమ్ బార్, విమ్ లిక్విడ్ గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంట్లో పాత్రలు తోమడానికి వాడే సోప్ లేదా లిక్విడ్ ఇది. ఇప్పటి వరకు ఈ ఉత్పత్తిని కేవలం మహిళలు వాడే వస్తువుగా మార్కెట్ చేస్తూ వచ్చింది హిందూస్థాన్ లీవర్. యాడ్స్‌లో కూడా మహిళలే ఉంటారు. అయితే కాలంతో పాటు సమాజంలో చాలా మార్పులు వచ్చాయి. ఇంటి పనులను పురుషులు కూడా చేస్తున్నారు. వారిని కూడా ఆకర్షించాలి. సేల్స్‌ను పెంచుకోవడానికి కొత్తగా వచ్చిన ఈ వినియోగదారులను మచ్చిక చేసుకోవాలి కదా?
ఇవాళ ఉదయం ప్రముఖ మోడల్ మిలింద్ సోమన్‌తో హిందుస్థాన్ లీవర్ ఓ యాడ్‌ను విడుదల చేసింది. అందులో ఓ కుర్రాడు జిమ్‌లో వ్యాయం చేస్తూ.. ‘రాత్రి నేను చాలా ఆలస్యంగా పడుకున్నానని… అమ్మకు సాయంగా పాత్రలు కడిగినట్లు అంటాడు. నిజంగా అమ్మకు సాయం చేయాల్సిందే అని పక్కనే వ్యాయామం చేస్తున్నవారితో అంటాడు. అపుడు మిలింద్ సోమన్ వచ్చి… ‘భలే చేశావ్ బిడ్డా… ఇందా… ఈ విమ్ బ్లాక్ ఫర్ మెన్… రాత్రింబవళ్ళు పాత్రలు కడుగు” అని అంటాడు.
ఈ యాడ్ ఉదయం నుంచి సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. యాడ్ చూసిన వెంటనే చాలా మందికి వచ్చిన అనుమానం ఏమిటంటే… అస్సలు హిందుస్థాన్ లీవర్ ఇలాంటి ప్రొడక్ట్ తయారు చేసిందా అని? మన ఊర్లో లేదే? మన షాపింగ్‌మాల్‌లో లేదే అని. నెట్‌లో చూస్తే పబ్లిసిటీ మెటీరియల్ కూడా చాలా ఉంది. బహుశా ప్రపంచంలోనే పురుషుల కోసం తయారు చేసిన తొలి డిష్‌వాష్ అని ప్రకటనలు ఉన్నాయి. వెంటనే హిందుస్థాన్ లీవర్‌కు చెందిన ఈ కామర్స్ స్టోర్ theushop.inకు వెళ్ళిన వారికి షాక్. నిజమే ఆ ప్రొడక్ట్ ఉంది. కాకపోతే ‘నో స్టాక్’ మెసేజ్ కన్పిస్తోంది. ధర కూడా చెప్పకపోవడంతో…పబ్లిక్‌కు మరింత ఆసక్తి పెరిగింది. నిజానికి ఇలా పురుషుల కోసం ప్రత్యేక విమ్ బార్‌ను హిందుస్థాన్ లీవర్ తయారు చేయలేదని.. అయితే ఇంటి పనుల విషయంలో మహిళలు, పురుషులు అన్న బేధం ఉండరాదని ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు తయారు చేసిన ప్రకటన అని తేలింది. హిందుస్థాన్ లీవర్ కొత్త యాడ్ నిజంగానే మార్కెట్‌లో హల్‌చల్ చేస్తోంది.
Does look like a new campaign to highlight gender bias in doing the dishes, in continuation to using Sehwag for doing dishes in April 2021 (the last Insta post on official channel before the latest set of posts). pic.twitter.com/shkzjFhN99
— Karthik 🇮🇳 (@beastoftraal) December 10, 2022