కొనసాగుతున్న పతనం
వాల్‌స్ట్రీట్‌లోఈక్విటీ షేర్ల అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ వెల్లడైన సర్వీస్ సెక్టార్ ప్రొడక్ట్స్ డేటా కూడా బలంగా ఉంది. దీంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు అధికంగా ఉంటుందని మార్కెట్ భయపడుతోంది. దీంతో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. నాస్డాక్ ఇవాళ మరో 1.56 శాతం క్షీణించింది. ఎస్ అండ్ పీ 500 సూచీ నష్టాలు కూడా ఒక శాతం పైనే ఉన్నాయి. డౌజోన్స్ సూచీ 0.55 శాతం నష్టంతో ట్రేడవుతోంది. యూరోపియన్ షేర్లు కూడా అరశాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. యాడ్స్‌కు మెటా కంపెనీ అవలంబిస్తున్న విధానాన్ని యూరప్ కోర్టులు ప్రశ్నిస్తున్నాయి. దీంతో మెటా షేర్ 8 శాతంపైగా నష్టంతో ట్రేడవుతోంది. ఒక డాలర్, బాండ్ ఈల్డ్స్ స్వల్పంగా తగ్గాయి. ఆ మేరకు బులియన్ ధరలు పెరిగాయి.