18600 దిగువకు నిఫ్టి
నిఫ్టి ఓపెనింగ్‌లోనే కీలక తొలి మద్దతు స్తాయిని నిఫ్టి కోల్పోయింది. ఇపుడు రెండో మద్దతు స్థాయిని పరీక్షించే అవకాశముంది. నిఫ్టి నిన్నటి కనిష్ఠ స్థాయిని బ్రేక్ చేసి 18,585 స్థాయిని తాకింది. ఇపుడు 18,588 స్థాయి వద్ద నిఫ్టి ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 112 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ఐటీ షేర్లలో అమ్మకాలు, మెటల్స్‌లో లాభాల స్వీకరణ నిఫ్టిని బాగా ప్రభావితం చేస్తున్నాయి. దిగువ స్థాయిలో కొనుగోలు చేసేవారు 18,550 స్టాప్‌లాస్‌తో ట్రేడ్ చేయాలని భావిస్తున్నారు.18544 దిగువకు వెళితే నిఫ్టి బేర్జోన్లో ప్రవేశిస్తుందని టెక్నికల్ అనలిస్టులు అంటున్నారు. కాబట్టి 18544 స్థాయిని స్టాప్‌లాస్‌గా ఉంచుకుని నిఫ్టిని కొనుగోలు చేయొచ్చని అనలిస్టులు అంటున్నారు. ఇవాళ నిఫ్టికి కొన్ని బ్యాంకు షేర్లు, లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు మద్దతుగా నిలబడ్డాయి. దాదాపు అన్ని సూచీలు రెడ్‌లో ఉన్నా… నిఫ్టి నెక్ట్స్ దాదాపు స్థిరంగా ఉంది. ఏక్షణమైనా లాభాల్లోకి వచ్చేలా ఉంది. విదేశీ ఇన్వెస్టర్లు వాటాలు కొనుగోలు చేయడంతో రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ షేర్ రూ. 17 లాభంతో రూ. 768 వద్ద ఈ షేర్ ట్రేడవుతోంది.