For Money

Business News

తగ్గనున్న చక్కెర ఉత్పత్తి.. షేర్లకు లాభాలు

ఈ ఏడాది భారత్‌లో చక్కెర ఉత్పత్తి ఏడు శాతం దాకా తగ్గే అవకాశముంనది రాయిటర్స్‌ వార్తా సంస్థ పేర్కొంది. దీనికి ప్రధాన కారణంగా వాతారణమని తెలిపింది. దీంతో ప్రభుత్వం ఎగుమతులపై ఆంక్షలు విధించే అవకాశముందని పేర్కొంది. విస్తీర్ణంలో మార్పు లేకున్నా చెరకు దిగుబడి బాగా తగ్గుతోందని తెలిపింది. సగటున చెరకు ఉత్పత్తి 15 శాతం తగ్గుందని ..కొన్ని చోట్ల 35 శాతం కూడా తగ్గే అవకాశముందని రైతులు అంటున్నట్లు రాయిటర్స్‌ పేర్కొంది. ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉండటమే దీనికి ప్రధాన కారణమని తెలిపింది. మహారాష్ట్రతో పాటు కర్ణాటకలో కూడా చెరకు దిగుబడి తగ్గుతోందని పేర్కొంది. ఈ రెండు రాష్ట్రాల నుంచి దిగుబడి తగ్గడంతో జాతీయ స్థాయిలో దిగుబడి తగ్గుతుందని పేర్కొంది. గత ఏడాది చక్కెర ఉత్పత్తి 3.58 కోట్లు టన్నులు కాగా, ఈ ఏడాది 3.33 కోట్ల టన్నులకు పరిమితం కావొచ్చని తెలిపింది. ఈ వార్తతో చక్కెర కంపెనీల షేర్లు పెరిగే అవకాశముంది.