స్థిరంగా SGX NIFTY
అంతర్జాతీయ మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి. గత శుక్రవారం అమెరికా మార్కెట్లు స్థిరంగా ముగిశాయి. డౌజోన్స్ గ్రీన్‌లో ఉన్నా… ఇతర సూచీలు నష్టాల్లో ఉన్నా…అన్ని చాలా స్వల్పమే. అంతకుముందు యూరప్ మార్కెట్లదీ అదే పరస్థితి. అయితే ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. చైనాలో కోవిడ్ కేసుల సంఖ్య బాగా తగ్గినట్లు వార్తలు రావడంతో చైనాతో పాటు హాంగ్‌కాంగ్ మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి.హాంగ్‌సెంగ్ సూచీ మూడు శాతంపైగా లాభంతో ఉంది. ఇక జపాన్ నిక్కీలో ఎలాంటి మార్పు లేదు. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 35 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. సో నిఫ్టి కూడా గ్రీన్‌లో ప్రారంభం కానుంది.