భారీగా పెరిగిన బులియన్
ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడంలో విజయవంతం అవుతున్నామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేసిన ప్రకటన డాలర్‌ను దారుణంగా దెబ్బతీసింది. డాలర్ ఇండెక్స్ దాదాపు ఒక శాతం క్షీణించింది.డాలర్ ఇండెక్స్ 105 దిగువకు వచ్చేసింది. అదే సమయంలో బాండ్ ఈల్డ్స్ కూడా తగ్గాయి. ఈ నేపథ్యంలో మెటల్స్ ముఖ్యంగా బులియన్ బాగా పెరిగింది. అమెరికా మార్కెట్లో వెండి నాలుగు శాతం పెరగ్గా, బంగారం మూడు శాతం పెరిగింది. ఇక మన ఎంసీఎక్స్ మార్కెట్లో ఫార్వర్డ్ అండ్ ఆప్షన్ విభాగంలో బులియన్ బాగా పెరిగింది. ఫిబ్రవరి 2020 పదిగ్రాముల బంగారం కాంట్రాక్ట్ ఇవాళ రూ.942 పెరిగి రూ. 53,873 వద్ద ట్రేడవుతోంది. అలాగే కిలో వెండి మార్చి 2023 కాంట్రాక్ట్ ఇపుడు రూ. 1727 పెరిగి రూ. 65188 వద్ద ట్రేడవుతోంది. రేపు స్పాట్ మార్కెట్లో కూడా బంగారంలో అప్ ట్రెండ్ కొనసాగే అవకాశాలు కన్పిస్తున్నాయి.