For Money

Business News

బైజూస్‌ చేతికి గ్రేట్‌ టర్నింగ్‌

సింగపూర్‌ కేంద్రంగా పనిచేస్తున్న గ్రేట్‌ లర్నింగ్‌ కంపనీని బైజూస్ టేకోవర్‌ చేసింది. ప్రొఫెషనల్‌, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రంగంలో నిమగ్నమైన గ్రేట్‌ లర్నింగ్‌ కంపెనీని 60 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసినట్లు పేర్కొంది. టేకోవర్‌ చేసిన ఈ కంపెనీని మరింత అభివృద్ధి చేసేందుకు మరో 40 కోట్ల డాలర్లను వెచ్చించనున్నట్లు బైజూస్‌ వెల్లడించింది. టేకోవర్‌ చేసిన తరవాత కూడా గ్రేట్‌ లర్నింగ్‌ స్వతంత్ర సంస్థగానే కొనసాగుతుంది.