స్థిరంగా SGX NIFTY
రాత్రి అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. డౌజోన్స్ స్థిరంగా క్లోజ్ కాగా, ఎస్ అండ్ పీ 500 సూచీ 0.16 శాతం నష్టంతో ముగిసింది. నాస్డాక్లో అమ్మకాల ఒత్తిడి రాత్రి కూడా కొనసాగింది. ఈ సూచీ రాత్రి 0.59 శాతం నష్టపోయింది. నిన్న యూరో మార్కెట్లు కూడా స్తబ్దుగా ముగిశాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 85 డాలర్ల ప్రాంతంలో ఉంది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. జపాన్ నిక్కీ ఒక్కటే 0.64 శాతం నష్టంతో ట్రేడవుతోంది. మిగిలిన సూచీలు లాభనష్టాల్లో ఉన్నా… తేడా చాలా తక్కువ. చైనా రెడ్లో ఉండగా, హాంగ్ సెంగ్, తైవాన్ వంటి మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి కూడా స్థిరంగా ఉంది. 4 పాయింట్ల నష్టంతో ఉంది. సో.. నిఫ్టిలో కూడా ఇవాళ స్థిరంగా ప్రారంభం కావొచ్చు.