నష్టాల్లో SGX NIFTY
రాత్రి అమెరికా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. వడ్డీ రేట్ల పెంపుపై మళ్ళీ మార్కెట్లో ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. అలాగే చైనాలో కరోనాకేసుల వ్యవహారం ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. రాత్రి అమెరికా మార్కెట్ల పతనానికి ప్రధాన కారణం ఇదే. యాపిల్ షేర్ రాత్రి రెండున్నర శాతం క్షీణించింది. రాత్రి అమెరికాలోని ప్రధాన మూడు సూచీలు ఒకటిన్నర శాతం క్షీణించాయి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లలో కూడా అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. జపాన్ అర శాతం నష్టంతో ట్రేడవుతోంది. హాంగ్‌కాంగ్ మాత్రం మూడు శాతం దాకా లాభపడింది. ఇక తైవాన్‌తో సహా ఇతర మార్కెట్లలో పెద్ద మార్పు లేదు. డాలర్ స్వల్పంగా క్షీణించగా, బ్రెంట్ క్రూడ్ లాభాల్లో ఉంది. అయితే బంగారం మళ్ళీ 1750 డాలర్ల దిగువకు వచ్చింది. సింగపూర్ నిఫ్టి 65 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. సో… నిఫ్టి నష్టాల్లో ప్రారంభమయ్యే అవకాశం అధికంగా ఉంది.