డిస్ట్రిబ్యూషన్ సర్వీస్‌లకు అమెజాన్ గుడ్‌బై?
ఫుడ్ డెలివరీ విభాగం, ఎడ్యుకేషన్ విభాగాలను మూసేసిన ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్… తాజాగా డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్ విభాగాన్ని కూడా మూసేయాలని నిర్ణయించింది. తన ప్రధాన వ్యాపారంపైనే అధికంగా దృష్టి పెట్టాలని, ఇతరవిభాగాలని కంపెనీ నిర్ణయించింది. భారత డీజీపీ వృద్ధి రేటు మందగిస్తోందని కంపెనీ భావించడమే దీని ప్రధాన కారణమని అమెజాన్ భావిస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ బెంగళూరు, హుబ్లి, మైసూర్‌లలో అమెజాన్ డిస్ట్రిబ్యూషన్ పని చేస్తోంది. ఇతర నగరాలకు ఈ సేవలను కంపెనీ విస్తరిస్తుందని భావిస్తున్న సమయంలో ఈ విభాగాన్ని ఏకంగా మూసేయాలని అమెజాన్ నిర్ణయించింది.