LEVELS: పడితే కొనొచ్చా…
నిఫ్టి ఇవాళ 80 పాయింట్ల నష్టంతో ప్రారంభం కానుంది. అంతర్జాతీయ మార్కెట్లలో ముఖ్యంగా ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. చైనాలో కోవిడ్ కేసుల పెరుగదలతో పాటు కోవిడ్ ఆంక్షలకు వ్యతిరేకంగా జనం తిరగబడటంతో అనేక మెటల్స్ ధరలు తగ్గుతున్నాయి. డిమాండ్ తగ్గవచ్చనే అంచనాతో క్రూడ్ ధరలు కూడా తగ్గాయి. డాలర్ ఇప్పటికే తక్కువస్థాయిలో కొనసాగుతోంది. బాండ్ ఈల్డ్స్ తగ్గాయి. ఇవన్నీ మన మార్కెట్కు సానుకూల అంశాలని సీఎన్బీసీ ఆవాజ్ మేనేజింగ్ ఎడిటర్ అనూజ్ సింఘాల్ అంటున్నారు. నిఫ్టి పడితే కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. డే ట్రేడర్స్ 18350, పొజిషనల్ ట్రేడర్స్ 18250 స్టాప్లాస్తో కొనుగోలు చేయొచ్చని ఆయన సలహా ఇస్తున్నారు. ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుదర్శన్ సుఖాని మాత్రం ఇవాళ కొనుగోలుకు దూరంగా ఉండాలని సూచించారు. రేపు లేదా ఎల్లుండి మార్కెట్ కొనుగోలు సంకేతాలు ఇవ్వొచ్చని తెలిపారు. మార్కెట్ నిలదొక్కుకునే పరస్థితుల్లో ఉండొచ్చని అన్నారు. తొందరపడి కొనుగోలు చేయొద్దని అంటున్నారు. ఒకవేళ కొంటే మాత్రం కచ్చితంగా స్టాప్లాస్ను పాటించాలని అనలిస్టులు సలహా ఇస్తున్నారు.