10 నెలల కనిష్టానికి క్రూడ్
చైనాలో జరుగుతున్న జీరో కోవిడ్ పాలసీ వ్యతిరేక ప్రదర్శనల ప్రభావం ఆయిల్ మార్కెట్‌పై తీవ్రంగా పడుతోంది. పైగా చైనాలో కోవిడ్ కేసులు పెరుగుతున్నందున చైనా మరిన్ని ఆంక్షలు విధించే అవకాశముంది. అనేక నగరాల్లో చైనా ఇపుడు లాక్డౌన్ విధించింది. దీన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అటు ఆంక్షలు, ఇటు ఆంక్షల వ్యతిరేక ప్రదర్శనల కారణంగా క్రూడ్ వినియోగం తగ్గుతుందని వార్తలు వస్తున్నాయి. దీంతో క్రూడ్ ధరలు భారీగా క్షీణించాయి. ఆసియా దేశాలు వినియోగించే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 81.68 డాలర్లకు చేరింది. అదే అమెరికా మార్కెట్ ముడి చమురు ధర 74.40 డాలర్లకు చేరింది. చైనా పరిస్థితి ఆయిల్‌తో పాటు మెటల్స్‌పై కూడా తీవ్రంగా చూపే అవకాశముంది. అంతర్జాతీయ మార్కెట్లలో ఈ ఏడాది ఆరంభంలో బ్రెంట్ క్రూడ్ 126 డాలర్లకు చేరింది. అక్కడి నుంచి 82 డాలర్ల దిగువకు చేరినా… భారత్‌లో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడం విశేషం.