NIFTY TRADE: పెరిగితే అమ్మడమే…
నిఫ్టి ఇవాళ వంద పాయింట్ల నష్టంతో ప్రారంభం కానుంది. నిఫ్టి 15,700 ప్రాంతానికి వచ్చిందంటే… నిఫ్టి బేర్ ఫేజ్‌లోకి వెళ్ళినట్లే. 15,810 దాటితే కాని నిఫ్టికి ‘బై’ సిగ్నల్ లేదు. చాలా ఆసియా మార్కెట్లు రెండు శాతం దాకా నష్టపోయాయి. చైనా మార్కెట్ల నష్టాలు మూడు శాతం దాకా ఉన్నాయి. టెక్ కంపెనీలపై చైనా దాడి… ఆ రంగానికి చెందిన షేర్లను చావుదెబ్బ తీస్తున్నాయి. హాంగ్‌కాంగ్ మార్కెట్ కూడా రెండున్నర శాతంపైగా నష్టపోవడానికి కారణం ఇదే. చైనా టెక్ కంపెనీల్లో పతనం…ఇతర మార్కెట్లను తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. అమెరికా ఫ్యూచర్స్ కూడా అర శాతం నష్టంతో ఉన్నాయి. మన మార్కెట్ల విషయానికొస్తే ఒక శాతం నష్టమంటే… కనీసం 150 పాయింట్లు, ఒకటిన్నర శాతం నష్టమంటే 200 శాతంపైగా నిఫ్టి పడే అవకాశముంది. పొజిషనల్, డే ట్రేడింగ్ సిగ్నల్స్ కూడా ‘సెల్’ సిగ్నల్స్ ఇస్తున్నాయి. మార్కెట్ వీక్‌గా ప్రారంభమైతే… మంచి ఫలితాలు ఇచ్చిన కంపెనీల్లో కూడా లాభాల స్వీకరణ జరగవచ్చు. ఇదే జరిగితే నిఫ్టి 15,660 స్థాయికి చేరొచ్చు. ఈ స్థాయి తరవాత నిఫ్టికి మద్దతు 15620. ఇవాళ యూరో మార్కెట్లు కీలక పాత్ర పోషించనున్నాయి. యూరో ఫ్యూచర్స్ కూడా వీక్‌గా ఉంటే నిఫ్టి ఇవాళ కోలుకోవడం కష్టం. యూరో లాభాల్లోకి వస్తేనే రికవరీకి ఛాన్స్ ఉంది. కాబట్టి నిఫ్టి ఏమాత్రం పెరిగినా అమ్మడానికి ఛాన్స్‌గా భావించవచ్చు.నిఫ్టి 15,770 దాటితేనే మద్దతు అందుతుంది.ఈ స్థాయికి వస్తే 15,790 స్టాప్‌లాస్‌తో అమ్మొచ్చు. నిప్టి ఈ స్థాయికి వస్తుందా అన్నది అనుమానమే. డే ట్రేడింగ్ చేసే చిన్న ఇన్వెస్టర్లు సాధ్యమైనంత వరకు మార్కెట్‌కు దూరంగా ఉండటమే మంచిది. సో… వ్యూహం సింపుల్. రిస్క్ వొద్దనకుంటే ట్రేడింగ్ చేయొద్దు. 15,770 ప్రాంతానికి వస్తే స్ట్రిక్ట్ స్టాప్‌లాస్‌తో అమ్మడం. 15,660కి వస్తే స్ట్రిక్ట్ స్టాప్‌లాస్ (15,640)తో కొనుగోలు చేయొచ్చు. పొజిషన్ క్యారీ చేయొద్దు.