ఎఫ్‌పీఓ ద్వారా రూ. 20,000 కోట్ల సమీకరణ
కొత్త షేర్లను జారీ చేయడం ద్వారా రూ. 20,000 కోట్ల సమీకరించాలని అదానీ ఎంటర్‌ప్రైజస్ నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ భేటీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజస్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ ఎఫ్‌పీఓ (Further Public Offering) కు వాటాదారుల నుంచి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఆమోదం పొందాలని కంపెనీ నిర్ణయించింది. గడచిన మూడు సంవత్సరాల్లో కంపెనీ షేర్ 1826 శాతం పెరిగింది. ఈ కంపెనీలో ప్రస్తుతం ప్రమోటర్లకు 72.63 శాతం వాటా ఉంది. ఎఫ్ఐఐలకు 15.59 శాతం వాటా ఉండగా, ప్రజలకు 6.46 శాతం, మ్యూచువల్ ఫండ్లకు 1.27 శాతం వాటా ఉంది. ఉన్న ప్లాంట్లను విస్తరణతో పాటు కొత్త టేకోవర్ల కోసం తాజాగా సమీకరించే నిధులను ఉపయోగిస్తారు. కంపెనీ ఎఫ్‌పీఓ జారీ చేశాక.. షేర్లో లిక్విడిటీ మరింత పెరుగుతుంది.