ఆల్టైమ్ కనిష్ఠ స్థాయి పేటీఎం
ఇప్పటి వరకు ఉన్న 52 వారాల కనిష్ఠ స్థాయి రూ. 510ని బ్రేక్ చేఉసి మరింత దిగువకు వెళ్ళింది పేటీఎం షేర్. న్యూఏజ్ షేర్లలో ఇటీవల భారీ అమ్మకాల ఒత్తిడి వస్తోంది. నైకా, జొమాటొ, పీబీతోపాటు అనేక షేర్ల నుంచి ఇన్వెస్టర్లు వైదొలగుతున్నారు. నైకా నుంచి యాంకర్ ఇన్వెస్టర్లు పోటీ పడి వైదొలగుతుండటంతో ఆ షేర్ కూడా భారీ నష్టాలతో ట్రేడవుతోంది. పేటీఎం షేర్ ఇవాళ రూ. 537లను తాకి.. క్రమంగా బలహీనపడుతూ రూ. 477లను తాకింది. అంటే ఇవాళ ఒక్క రోజే 15 శాతం క్షీణించిందన్నమాట. అక్కడి నుంచి స్వల్పంగా కోలుకుని ఇపుడు 10.22 శాతం నష్టంతో రూ. 482.10 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత స్థాయి వద్ద కూడా ఈ షేర్ బలహీనంగా ఉందని, కొనుగోలు చేయొద్దని అనలిస్టులు సలహా ఇస్తున్నారు.