ప్రి బడ్జెట్ సమావేశాలు షురూ
వచ్చే ఆర్థిక సంవత్సరానికి అంటే 2023-24 బడ్జెట్‌పై కసరత్తు కేంద్ర ఆర్థిక శాఖ ప్రారంభించింది. వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ సమావేశమయ్యారు. వచ్చే బడ్జెట్లో ఉద్యోగాల కల్పన వేగవంతం చేసే అంశాలపైనే దృష్టి సారించినట్లు కేంద్ర నిర్మలా సీతారామన్తెలిపారు. జీఎస్టీ, ఆదాయపు పన్నును హేతుబద్దీకరించి పారిశ్రామిక రంగం అభివృద్ధికి కృషి చేస్తామని ఆమె హామి ఇచ్చారు. దేశ ఆర్థిక ప్రగతికి ఐదు అంశాల అజెండాను పారిశ్రామికవేత్తలు ఆర్థిక మంత్రికి అందజేశారు. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఎన్నికల బడ్జెట్ ఇది. సార్వత్రిక ఎన్నికల ముందు మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ కానుంది. ఇంకా ఆర్థిక వేత్తల నుంచి మంత్రి ఫీడ్ బ్యాక్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
Union Finance Minister Smt. @nsitharaman chairs her 2nd #PreBudget2023 consultation with the second group of captains from Industry & experts of #Infrastructure and #ClimateChange, in New Delhi, today. (1/2) pic.twitter.com/ARAiQj2jg3
— Ministry of Finance (@FinMinIndia) November 21, 2022