చైనాలో కుప్పకూలిన టెక్ షేర్లు
ఇటీవల చైనా టెక్నాలజీ కంపెనీలపై దాడుల ప్రారంభించింది. దాదాపు దేశంలో అన్ని ప్రధాన కంపెనీలపై దాడుల జరిగాయి. అనేక ఆంక్షలు విధించాయి. ఇటీవల న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టయిన దిది… చైనా దెబ్బకు భారీగా క్షీణించింది. చైనాకు చెందిన దీదీ అమెరికాలో భారీ ప్రీమియంతో లిస్టయింది. అయితే ప్రభుత్వం చర్యలతో ఆ షేర్ భారీగా క్షీణించింది. ఇటీవల బాగా క్షీణించిన కంపెనీలు…
షియోమి : -31%
టెన్సెంట్ : -33%
జేడీ : -35%
ఆలిబాబా : -36%
మ్యూటుయాన్: -43%
జీడీఎస్ : -49%
బైదు : -53%
దీదీ : -55%
జాయ్ : -64%
టెన్సెంట్ మ్యూజిక్ : -67%
(data courtesy Charlie billelo)
వీటిలో చాలా కంపెనీలు బహుళజాతి కంపెనీలు. హాంగ్‌కాంగ్, సింగపూర్, యూఎస్‌లో లిస్టయ్యాయి. అమెరికాలో టెక్ కంపెనీలు ఆల్‌టైమ్‌లో కొత్త రికార్డులు సృష్టిస్తుండగా… చైనా ఈ చర్య ఎందుకు తీసుకొంటోందో స్టాక్ మార్కెట్ విశ్లేషకులకు కూడా అర్థం కావడం లేదు. ఏదో వ్యూహం లేకుండా చైనా ఇలాంటి చర్యలు తీసుకోదని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే చైనా చర్యల వల్ల అమెరికాలో లిస్టయిన అనేక కంపెనీల షేర్లు తగ్గాయి.