For Money

Business News

స్థిరంగా కొనసాగుతున్న నిఫ్టి

ఉదయం నుంచి స్వల్ప నష్టాల్లో ఉన్న నిఫ్టి ప్రస్తుతం దాదాపు క్రితం ముగింపు స్థాయి వద్దే కొనసాగుతోంది. కేవలం 15 పాయింట్ల నష్టతో 18394 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.దిగువ స్థాయి నుంచి 40 పాయింట్లు కోలుకుంది. యూరో మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. ప్రధాన సూచీలు ఒక మోస్తరు లాభాలతో ఉన్నాయి. అలాగే అమెరికా ఫ్యూచర్స్‌ కూడా గ్రీన్‌లో ఉన్నాయి. వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ ఒత్తిడి లేకుంటే మార్కెట్‌లో గ్రీన్‌లో క్లోజయ్యే అవకాశముంది. పది గంటల ప్రాంతంలో వచ్చిన షార్ట్‌ కవరింగ్‌ చూస్తే… నిఫ్టి స్థిరంగా ముగిసే అవకాశముంది. 18500 ప్రాంతంలో భారీ ఎత్తున కాల్ రైటింగ్‌ సాగుతోంది. ప్రస్తుతానికి ఈ స్థాయి ప్రధాన నిరోధంగా మారింది. పేటీఎం ఇంకా 9 శాతం నష్టంతో ఉంది. ఉదయం 5 శాతం నష్టంతో ఉన్న నైకా ఇపుడు ఒక శాతంపైగా లాభంతో ఉంది.