కళామందిర్ పబ్లక్ ఆఫర్‌కు గ్రీన్ సిగ్నల్
దుస్తుల రీటైల్ వ్యాపారం చేసే సాయి సిల్క్స్ కళామందిర్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకు స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతి లభించింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ .1200 కోట్లు సమీకరించాలనేది ఈ సంస్థ భావిస్తోంది. ఇందులో రూ.600 కోట్ల విలువైన కొత్తగా షేర్లు జారీ చేస్తారు. 1.80 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ప్రమోటర్ల గ్రూపు సంస్థలు ఈ ఆఫర్ ద్వారా అమ్ముకుంటాయి. ప్రస్తుతం ఆంధ్ర , తెలంగాణ , కర్ణాటక , తమిళనాడు రాష్ట్రాల్లో 50 రీటైల్ స్టోర్లు ఈ సంస్థకు ఉన్నాయి. పబ్లిక్ ఇష్యూ ద్వారా సమీకరించే నిధులను 25 కొత్త స్టోర్ల ప్రారంభం, రెండు గోదాముల ఏర్పాటు, ఇతర వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనున్నారు. 2022 మార్చి నెలతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ రూ.1129 కోట్ల టర్నవర్‌పై రూ. 58 కోట్ల నికర లాభం ఆర్జించింది.