18400పైన ముగిసిన నిఫ్టి
ఉదయం అనలిస్టులు ఊహించినట్లే నిఫ్టి వంద పాయింట్లు అటూ ఇటూ కదలాడి 18403 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 74 పాయింట్లు పెరిగింది. అమెరికా ఈక్విటీ ఫ్యూచర్స్ గ్రీన్లో ఉండటంతో సూచీలకు అండ లభించింది. నిఫ్టిలో 36 షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇక ఇతర సూచీల విషయానికొస్తే నిఫ్టి బ్యాంక్ ఒక్కటే 0.7 శాతం లాభంతో ముగిసింది. నిఫ్టి మిడ్ క్యాప్, నిఫ్టి నెక్ట్స్ నిన్నటి ముగింపు వద్దే ముగిశాయి. అంటే కేవలం నిఫ్టి పెరిగేందుకు దోహద పడే షేర్లకే లాభాలు పరిమితమయ్యాయి. ఉదయం నుంచి లాభాల్లో పలు షేర్లు చివర్లో నష్టాల్లోకి జారుకోగా, ఇతర షేర్లు లాభాల్లోకి వచ్చాయి. నిఫ్టిలో పవర్ గ్రిడ్, ఓఎన్జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు రెండు శాతంపైగా లాభంతో ముగిశాయి. ఇక నిఫ్టి నెక్ట్స్ని నైకా (9 శాతం) నౌకరి (4.69 శాతం)తో పాటు ఐఆర్టీసీ, పే టీఎం షేర్లు బాగా దెబ్బకొట్టాయి. బాలకృష్ణ ఇండస్ట్రీస్ అనూహ్యంగా 5 శాతం దాకా లాభంతో ముగిసింది. ఇవాళ ఫార్మా షేర్లలో నాట్కో, డాక్టర్ రెడ్డీస్, దివీస్ షేర్లు రెండు శాతం దాకా లాభపడ్డాయి. లోకల్ షేర్లలో స్టార్ షేర్… రెయిన్బో చిల్ట్రన్స్ హాస్పిటల్ ఈ షేర్ ఇవాళ 6 శాతంపైగా లాభపడి రూ.867 వద్ద ముగిసింది.