VLC వెబ్‌సైట్‌పై నిసేధం ఎత్తివేత
మల్టీమీడియా ప్లేయర్ వీఎల్‌సీ (VLC) వెబ్‌సైట్‌పై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ ఏడాది ఆరంభంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ ఈ వెబ్‌సైట్‌ను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. యాప్ నుంచి వీఎల్‌సీని యూజర్స్ డౌన్‌లోడ్ మాత్రం కొనసాగుతోంది. అయితే వెబ్‌సైట్ నుంచి డేటా మరో దేశానికి వెళుతోందంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వెబ్‌సైట్‌ను భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఇపుడు వెబ్‌సైట్ నుంచి కూడా యూజర్లు ఈ వీడియో ప్లేయర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీడియా ప్లేయర్లలో వీఎల్‌సీకి మంచి ఆదరణ ఉంది. ఇప్పటివరకు 7.3 కోట్లమంది వీఎల్‌సీ ప్లేయర్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. తమ వెబ్‌సైట్‌ను ఎందుకు నిషేధించారో తెలపాలని గత నెల అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వానికి వీఎల్‌సీ మేకర్స్ లీగల్ నోటీసులు పంపించారు. ఈ నేపథ్యంలో వీఎల్‌సీ మీడియా ప్లేయర్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేసింది.