స్థిరంగా SGX NIFTY
శుక్రవారం అమెరికా మార్కెట్ గ్రీన్‌లో ముగిసింది. డాలర్ బాగా క్షీణించడంతో పాటు బాండ్ ఈల్డ్స్ కూడా భారీగా రాణించడంతో నాస్డాక్ 1.88 శాతం పెరిగింది.ఎస్ అండ్ పీ500 సూచీ కూడా 0.92 శాతం పెరగ్గా, డౌజోన్స్ మాత్రం 0.10 శాతం లాభంతో ముగిశాయి. సెనేట్‌లో డెమొక్రాట్ల పట్టు కూడా మార్కెట్‌కు పాజిటివ్‌గా మారింది. ఇదే సమయంలో క్రూడ్ భారీగా క్షీణించింది. ఇపుడు మళ్ళీ 96 డాలర్లకు చేరింది. ఇక ఇవాళ ఆసియా మార్కెట్లలో కొన్ని మార్కెట్లు మినహా మిగిలిన మార్కెట్లన్నీ గ్రీన్‌లో ఉన్నాయి. జపాన్ నిక్కీ 0.73 శాతం నష్టపోగా.. న్యూజిల్యాండ్ నష్టాలు ఇదే స్థాయిలో ఉన్నాయి. చైనా మార్కెట్లు చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. చైనా డేటా పాజిటివ్‌గా ఉండటంతో క్రూడ్ ధరలు భారీగా పెరిగాయి. చైనా మార్కెట్లు ఒక శాతం వరకు పెరగ్గా, హాంగ్‌సెంగ్ మాత్రం 2.25 శాతం పెరిగింది. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 5 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. సో.. నిఫ్టి కూడా స్థిరంగా ప్రారంభం కానుంది.