For Money

Business News

ఈక్విటీ మార్కెట్లకు పండుగ

ఒకే ఒక్క నెగిటివ్‌ వార్త స్టాక్‌ మార్కెట్‌లో పండుగను తెచ్చింది. రాత్రి అమెరికా వినియోగదారులు ధరల సూచీ (సీపీఐ) డేటా వచ్చింది. ఫెడరల్‌ రిజర్వ్‌ వరుసగా వడ్డీ రేట్లను పెంచడంతో… దాని ప్రభావం సీపీఐపై పడింది. ద్రవ్యోల్బణం కట్టడి అవుతుందన్న మాట. అంటే వచ్చే నెలలో ఫెడరల్‌ రిజర్వ్‌ భారీగా వడ్డీ రేట్లు పెంచదని తేలిపోయింది. అంతే రాత్రి అమెరికా మార్కెట్లు పిచ్చి పట్టినట్లు పెరిగాయి. నాస్‌డాక్‌ 7.35 శాతం పెరగ్గా, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 5.54 శాతం పెరిగింది. ఇక డౌజోన్స్‌ కూడా 3.7 శాతం పెరిగిదంటే మార్కెట్‌ మూడ్‌ అర్థం చేసుకోవచ్చు. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు కూడా గ్రీన్‌లో ఉన్నాయి చైనా తప్ప. జపాన్‌, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌ సూచీ రెండు శాతంపైగా పెరగ్గా, తైవాన్‌ సూచీ మూడున్నర శాతం పెరిగింది. ఇక సింగపూర్‌ నిఫ్టి ఏకంగా 300 పాయింట్ల లాభంతో ఉంది. ఇవాళ నిఫ్టి కూడా భారీ లాభాలతో ప్రారంభం కానుంది.