దుమ్ము రేపుతున్న మార్కెట్లు
కన్జూమర్ ప్రైస్ ఇండెక్ 9 నెలల కనిష్ఠానికి పడటంతో ఈక్విటీ మార్కెట్లు పట్ట పగ్గాల్లేకుండా పెరుగుతున్నాయి. ధరల సూచీ తగ్గినందున, ఫెడరల్ రిజర్వ్ అవలంబిస్తున్న అధిక వడ్డీ రేట్ల ఫార్ములా పనిచేస్తోందని… మున్ముందు భారీగా వడ్డీ రేట్లు పెరగకపోవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో డాలర్ ఇండెక్స్ రెండు శాతంపైగా పడిపోయింది. ఇక నాస్డాక్ ఏకంగా 5.8 శాతం, ఎస్ అండ్ పీ 500 4.29 శాతం, డౌజోన్స్ 2.78 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. ఒకే సెషన్లో నాస్డాక్ పెరగడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి. క్రూడ్, బులియన్ కూడా పెరిగాయి.