ఢిల్లీ లిక్కర్ బిజినెస్‌లో 30 శాతం ట్రైడెంట్ చేతిలో?
అరబిందో గ్రూప్ డైరెక్టర్ అయిన శరత్ చంద్రా రెడ్డి తమ గ్రూప్ కంపెనీల సాయంతో ఢిల్లీ లిక్కర్ బిజినెస్‌లో 30 శతం ను హస్తగతం చేసుకున్నారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ఈడీ) ఆరోపించింది. ఇదే కేసులో మరో నిందితుడు అయిన బినోయ్ ప్రసాద్‌ను ఈడీ ఇవాళ సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టింది. శరత్ చంద్రా రెడ్డికి చెందిన ట్రైడెంట్ కెమ్‌ఫార్, ఇతర కంపెనీలతో కుమ్మక్కయి 5 జోన్లలో వ్యాపారాన్ని కంట్రోల్ చేస్తున్నట్లు ఈడీ ఆరోపించింది.ఈ కేసులో అత్యంత కీలక పాత్రధాని అయిన ఇండో స్పిరింట్స్లో శరత్ చంద్రారెడ్డి రూ. 60 కోట్ల పెట్టుబడి పెట్టారని వెల్లడించింది. ప్రస్తుతం అయిదు రీటైల్ జోన్స్‌లో శరత్ రెడ్డి కంట్రోల్ ఉన్నట్లు పేర్కొంది. ఢిల్లీలో మొత్తం లిక్కర్ వ్యాపారంలో 30 శాతం వ్యాపారం ఈ అయిదు జోన్లలోనే ఉందని పేర్కొంది. అంటే మూడో వంతు లిక్కర్ వ్యాపారాన్ని శరత్‌చంద్రారెడ్డి తన కంట్రోల్ లో ఉంచుకున్నారని పేర్కంది.