‘మధ్యంతర అనిశ్చితి’తో నష్టాలు
అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఇంకా పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ప్రజా ప్రతినిధుల సభలో రిపబ్లికన్స్ మెజారిటీకి దగ్గరగా ఉండగా.. సెనెట్‌లో డెమొక్రట్లది పైచేయిగా ఉండే అవకాశముంది. అయితే జార్జియా ఎన్నికల తరవాత సెనేట్ వ్యవహారం తేలేలా ఉంది. రెండు సభల్లోనూ మెజారిటీ చాలా తక్కువగా ఉండటంతో విధానపరంగా అనిశ్చితి ఉండే అవకాశముంది. అయితే చట్టసభల్లో అనిశ్చితి ఉండి.. డెమొక్రటిక్ అభ్యర్థి అధ్యక్షుడిగా ఉంటే స్టాక్ మార్కెట్లు పెరిగినట్లు చరిత్ర చెబుతోంది. ఎన్నికల అనిశ్చితి కారణంగా డాలర్ స్వల్పంగా పెరిగింది. డాలర్ ఇండెక్స్ 110 వద్ద ఉంది. ఈక్విటీ షేర్లలో నాస్డాక్ మళ్లీ 1.3 శాతం నష్టంతో ఉంది. ఇక డౌజోన్స్ 0.8 శాతం, ఎస్ అండ్ పీ 500 సూచీ 0.84 శాతం నష్టంతో ఉన్నాయి. డెమొక్రట్లకు మెజారిటీ వచ్చే పక్షంలో ఐటీ రంగానికి దెబ్బగానే భావించాలి. క్రూడ్ ఆయిల్ కూడా నష్టాల్లో ఉంది. బ్రెంట్ క్రూడ్ 94 డాలర్ల ప్రాంతంలో ట్రేడవుతోంది.